దాసరి – విష్ణు కాంబినేషన్ లో తమిళ రీమేక్.?

దాసరి – విష్ణు కాంబినేషన్ లో తమిళ రీమేక్.?

Published on Jun 26, 2014 9:05 AM IST

dasari-vishnu

టాలీవుడ్ లో ఈ మధ్య రీమేక్ సినిమాలు బాగానే ఎక్కువయ్యాయి. తాజాగా దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టారు. తమిళంలో చిన్న సినిమాగా తెరకెక్కి పెద్ద హ్హిట్ అందుకున్న తమిళ సినిమా ‘మంజపై’. తాత – మనవళ్ళ మధ్య ఉండే ఆత్మీయకు అద్దంపట్టే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా రీమేక్ రైట్స్ ని దాసరి నారాయణరావు కొనుక్కున్నారు.

ఈ సినిమా ద్వారా మళ్ళీ ఆయన మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోగా మంచు విష్ణుని ఎన్నిక చేసినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. ‘పరమవీరచక్ర’ సినిమా తర్వాత దాసరి పలు సినిమాలు అనుకున్నప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. కానీ ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇందులో విష్ణుకి తాతగా ఎవరు నటిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

దాసరి తన మొదటి సినిమాగా ఆత్మీయ అనుబంధాలకు అద్దంపట్టేలా ‘తాత – మనవడు’ సినిమా తీసి హిట్ అందుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకు అలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకున్న దాసరి ఇందులో ఎలాంటి వైవిధ్యాన్ని చూపిస్తారో చూడాలి.

తాజా వార్తలు