ఇక వచ్చేవారం ఆముగ్గురిలో ఒకరికి మూడుతుంది.

Published on Oct 8, 2019 3:00 pm IST

బిగ్ బాస్ లో ఆదివారం ఎలిమినేషన్ సోమవారం నామినేషన్ అన్న సంగతి తెలిసందే. ఆదివారం లేడీ కంటెస్టెంట్ పునర్నవిని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపిన బిగ్ బాస్ సోమవారం వచ్చేవారం ఎలిమినేషన్స్ సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. మిగిలిన ఎనిమిది మంది ఇంటి సభ్యులలో ఈ వారం ఎలిమినేషన్ కి గాను నలుగురు సభ్యులు నామినేట్ కబడ్డారు. వారిలో స్టార్ కపుల్ వరుణ్ వితిక శేరు, రాహుల్ మరియు మహేష్ విట్టా ఉన్నారు. ఐతే గతంలో ఒక టాస్క్ విన్నర్ గా నిలిచిన వితికాకు ఒక ఎలిమినేషన్ నుండి తప్పించుకొనే అవకాశం ఉండటంతో ఆమె ఆ అవకాశం ఉపయోగించుకొని, ఎలిమినేషన్ నుండి బయటపడ్డారు.

ఇక మిగిలిన ముగ్గురు సభ్యులైన వరుణ్, మహేష్, రాహుల్ లలో ఒకరు వచ్చే వారం షో నుండి బయటకు వెళ్లిపోనున్నారు. చాలా మంది అభిప్రాయం ప్రకారం వరుణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ, కాబట్టి ఈ ఈవారం మహేష్, రాహుల్ లలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ కావచ్చు. చూద్దాం ఈ వారం ప్రేక్షకులు ఎవరిని ఇంటిదారి పట్టిస్తారో.

సంబంధిత సమాచారం :

More