కేవలం రూ.10కే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్

కేవలం రూ.10కే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్

Published on Nov 13, 2025 8:35 AM IST

g

దుబాయ్‌ కేంద్రంగా ఉన్న రాయల్‌ ర్యాప్చీ సంస్థ భారతీయ ఓటీటీ రంగంలోకి ‘టిబిడి (త్రిభాణధారి)’ ద్వారా అడుగుపెట్టింది. కేవలం రూ.10 నెలసరి సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులోకి వస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌ లోగోను హైదరాబాద్‌లో నిర్మాత కె.కె. రాధామోహన్‌ ఆవిష్కరించారు.

ఫౌండర్‌ ధరమ్‌ గుప్తా మాట్లాడుతూ.. “కుటుంబం అంతా చూడగల దేశీ కంటెంట్‌కే ప్రాధాన్యం. చిన్న నిర్మాతలకు పెద్ద వేదికగా టిబిడి నిలుస్తుంది” అన్నారు. సౌత్‌ సీఈఓలు డి.ఎస్‌.రావు, వి. సముద్ర మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో చిన్న సినిమాలకు అవకాశమిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సునీల్‌ భోజ్వానీ, సత్తిబాబు, సురేష్‌ కొండేటి, బసిరెడ్డి తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు