ఈ వివాదాన్ని ఎన్టీఆర్ మాత్రమే ఆపగలరు !

ఈ వివాదాన్ని ఎన్టీఆర్ మాత్రమే ఆపగలరు !

Published on Jun 7, 2020 12:08 PM IST

మీరా చోప్రాకి చాల సినిమాలు చేసినా రాని పాపులారిటీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పోరాటంతో జాతీయ స్థాయిలో వచ్చేసింది. ఆమెకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదాల పై ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతున్నా, ఎన్టీఆర్ స్పందించలేదు. ఈ వివాదం పై మంత్రి కేటీఆర్ సైతం స్పందించడం, సైబర్‌ సెల్ పోలీసులు సైతం ద‌ర్యాప్తు చేస్తూ విచారణ జరుపుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఇప్పటికే ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఇప్పుడైనా ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుందని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.

మహిళలను గౌరవించే జూనియర్ ఎన్టీఆర్ మీరాచోప్రా విషయంలో కూడా లీడ్ తీసుకుని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. అయితే సాధారణంగా ఇటువంటి వాటికి ఎన్టీఆర్ స్పందించరని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ విషయం ఇప్పుడు సాధారణమైనది కాదు, ఎన్టీఆర్ మాత్రమే ఈ వివాదాన్ని ఆపగలరు.

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకు మిస్ అయిన తారక్ ఫస్ట్ లుక్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? ఆ వీడియోలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు