చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాదించిన చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’. నాగ శౌర్య, రాశి ఖన్నా జంటగా శ్రీని అవసరాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు సినిమా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ఇప్పుడు శాటిలైట్ రేటు విషయంలో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను మాటీవీ 1.75 కోట్లకు సొంతం చేసుకుంది. చిన్న సినిమా ఈ రేంజ్లో అమ్ముడుపోవడం ఒక రికార్డు.
కళ్యాణి కోడూరి సంగీతం ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించింది. లీడ్ పెయిర్ నాగ శౌర్య, రాశి ఖన్నాల అభినయం, శ్రిని అవసరాల డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత నెల 20న విడుదలైన ఈ సినిమా ఇంకా చాలా ఏరియాలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది.


