విజయ్ సినిమాలో ‘ఆరెంజ్’ ఫ్లేవర్ ఉంటుందా?

Published on Sep 18, 2019 7:09 pm IST

విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇటీవలే ఈ సినిమా లాంచ్ అయింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, క్యాథరిన్ థ్రెస, ఐశ్వర్య రాజేశ్, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇలా ఒకేసారి నలుగురు హీరోయిన్స్ అంటుండటంతో సినిమాలో రామ్ చరణ్ గతంలో చేసిన ‘ఆరెంజ్’ సినిమా షేడ్స్ ఉంటాయని, ఇందులో హీరో నిజమైన ప్రేమ కోసం వెతికే యువకుడి పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు సినిమా సింగరేణి బ్యాక్ డ్రాప్లో ఉంటుందని కూడా వార్తలొస్తున్నాయి. కె.ఏ.వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయనున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ పెద్దగా విజయం సాధించకపోవడంతో ఈ సినిమాపై విజయ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఈ నెల 20న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More