రాజ్ తరుణ్ మూవీపై వస్తున్న పుకార్లలో నిజం లేదట.

Published on Apr 9, 2020 11:00 pm IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా తెరక్కుతున్న లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా. దర్శకుడు కొండా విజయ్ కుమార్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఐతే కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది. దీనితో ఈ మూవీ విడులపై ఒక ఆసక్తి వార్త ప్రచారం లోకి వచ్చింది.

ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని నేరుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని. నెట్ ఫ్లిక్స్, అమెజాన్,సన్ నెక్స్ట్, హాట్ స్టార్ వంటి డిజిటల్ మాధ్యమాల్లో ఎదో ఒక మాధ్యమం ద్వారా ఈ మూవీ థియేటర్స్ లోకి రాకుండా నేరుగా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. ఐతే ఈ వార్తలను చిత్ర నిర్మాత రాధా మోహన్ ఖండించారు. నేరుగా ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల చేస్తున్నాం అనే వార్తలో ఎటువంటి నిజం లేదని చెప్పారు. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఈ మూవీ రిలీజ్ ఉంటుందని తెలియజేశారు.

సంబంధిత సమాచారం :

X
More