‘ఉత్తమ విలన్’ కొరకు ఆస్కార్ నామినేటెడ్ సౌండ్ డిజైనర్.

‘ఉత్తమ విలన్’ కొరకు ఆస్కార్ నామినేటెడ్ సౌండ్ డిజైనర్.

Published on Jan 18, 2015 6:18 PM IST

Craig-Mann
లాస్ ఏంజెల్స్ లో గల హాలీవుడ్ స్టూడియోలో ‘ఉత్తమ విలన్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సౌండ్ మిక్సింగ్ కార్యక్రమాలలో కమల్ హాసన్ బిజీగా ఉన్నారని 123తెలుగు.కామ్ గతంలో తెలియజేసింది. తాజా సమాచారం ఏంటంటే.. హాలీవుడ్ సౌండ్ మిక్సింగ్ ఇంజినీర్ క్రైగ్ మాన్ ‘ఉత్తమ విలన్’ సినిమాకు వర్క్ చేస్తున్నారు. కునాల్ రాజన్ తో కలసి ఈ సినిమా పనులను నిర్వర్తిస్తున్నారు.

క్రైగ్ మాన్, ఈ ఏడాది హాలీవుడ్ సినిమా ‘విప్ షెల్’ సినిమాకు గాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు. ‘ది బోర్న్ అల్టిమేటం’, ‘కెప్టెన్ అమెరికా’ & ‘ఇన్సైడర్స్ : చాప్టర్ 2’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు క్రైగ్ మాన్ సౌండ్ డిజైన్ చేశారు. తాజాగా బాఫ్తా అవార్డులకు సైతం క్రైగ్ మాన్ నామినేట్ అయ్యారు. క్రైగ్ మాన్ ఎంపికతో మరోసారి హై స్టాండర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ కు ప్రాధాన్యత ఇస్తారని చాటి చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు