Shambala OTT Date: ఆది సూపర్ నాచురల్ థ్రిల్లర్ “శంబాల”, ఎప్పుడు ఎందులో అంటే!

Shambhala

రీసెంట్ గా మన టాలీవుడ్ సినిమా రిలీజ్ కి మంచి హిట్ అయ్యిన చిత్రాల్లో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన డివోషనల్ హిట్ చిత్రం “శంబాల”(Shambala) కూడా ఒకటి. ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాని దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్ లో వచ్చి ఆది కెరీర్ లోనే మంచి గ్రాసర్ గా నిలిచి తనకి మంచి కంబ్యాక్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రీసెంట్ గానే హిందీలో కూడా విడుదల అయ్యింది.

అయితే ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసుకుంది. మరి ఈ చిత్రాన్ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ జనవరి 22 నుంచి అందుబాటులో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రాన్ని ఆహా గోల్డ్ యూజర్స్ అయితే ఒక 24 గంటల ముందే చూసే అవకాశం కూడా ఉంది. సో ఈ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ని అప్పుడు మిస్ అయ్యినవారు ఉంటే ఆహా లో చూడొచ్చు. కానీ అందుకు కొంచెం సమయం వేచి ఉండాలి.

Exit mobile version