టాక్..ఈ “దృశ్యం 2″కి ఓటిటి డీల్స్ నడుస్తున్నాయా.?

Published on Jun 4, 2021 10:00 am IST

మన ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్స్ హిట్ శాతం అన్నది చాలా తక్కువే అని అందరికీ తెలిసిందే. ఎక్కడో కొన్ని సినిమాలు మాత్రం సీక్వెల్ చేస్తే భారీ హిట్స్ గా నిలిచాయి. మరి అలాంటి సీక్వెల్స్ జాబితాలో మ్యాజిక్ చేసిన మరో అద్భుత చిత్రం “దృశ్యం 2”. మళయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ మోహన్ లాల్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఓటిటిలో భారీ స్థాయి విజయాన్ని నమోదు చేసుకుంది.

అయితే థియేట్రికల్ విడుదలకు నోచుకోవాల్సిన సినిమా ఇది అని ప్రైమ్ వీడియోలో విడుదలయ్యాక టాక్ వచ్చినా ప్రయోజనం లేకపోయింది.. మరి ఈ చిత్రం విజయం అందుకోవడంతో మన తెలుగులో కూడా శరవేగంగా విక్టరీ వెంకటేష్ సినిమా షూట్ స్టార్ట్ చేసేసారు. దీనికి ముందు పార్ట్ 1 లో కూడా నటించిన వెంకీ మామ తన కెరీర్ లో మరో భారీ హిట్ గా నమోదు చేసుకున్నారు.

మరి అలా షూట్ స్టార్ట్ చేసిన ఈ సీక్వెల్ ను కూడా జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసేసారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి కూడా అదే ప్రైమ్ వీడియోతో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ పై చర్చలు నడుస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఇంకా డీల్ మాత్రం కంప్లీట్ కాలేదని కూడా టాక్. మరి ఈ ఇంట్రెస్టింగ్ చిత్రం ఎలా విడుదల కానుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :