ఓటీటీ : ఆ నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ‘మా ఇంటి బంగారం’ !

సమంత హీరోయిన్‌గా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. పైగా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మైలురాయిని అధిగమించి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా అధికారికంగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం జూలై 17న, 2026 (శుక్రవారం నాడు) ‘జియో హాట్ స్టార్’ (Jio Hotstar)లో ప్రత్యేకంగా డిజిటల్ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో అద్భుత విజయం సాధించిన నెల రోజుల లోపే ఈ చిత్రం ఇలా డిజిటల్ వేదికపైకి వస్తుండటం విశేషం.

కాగా, ఈ సినిమా రిలీజ్ టైమ్ లో ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇప్పుడు, ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ ఇలా నాలుగు భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కాగా సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. మరో రెండేళ్లలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఇన్‌స్పిరేషన్ తనకు కలగడం ఇదే తొలిసారి అని, రాబోయే చిత్రం డబుల్ ఫన్, డబుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు.

Exit mobile version