Karuppu OTT: ఓటిటిలోకి ‘వీర భద్రుడు’.. ఓటిటి సంస్థ సర్ప్రైజ్ హింట్!

Karuppu OTT: ఓటిటిలోకి ‘వీర భద్రుడు’.. ఓటిటి సంస్థ సర్ప్రైజ్ హింట్!

Published on Jun 7, 2026 9:00 PM IST

Karuppu

తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రమే ‘కరుప్పు’. తెలుగులో వీర భద్రుడు గా వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ కంబ్యాక్ గా తనకి నిలిచింది. అటు తమిళ్ లోను ఇటు తెలుగులో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి అదరగొట్టింది. ఇప్పటికీ థియేటర్స్ లో బాగానే రాణిస్తున్న ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓటిటి హింట్ బయటకి వచ్చింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా వారు ఓ సర్ప్రైజ్ హింట్ అందించారు. టైటిల్ ఏది పెట్టకుండా ‘గాడ్ మోడ్ ఆన్’ అంటూ సింపుల్ పోస్టర్ తో కరుప్పు సినిమాలో డైలాగ్ తో హింట్ ఇచ్చేసారు. దీనితో వీర భద్రుడు ఓటిటి రిలీజ్ కి ఇప్పుడు సమయం ఆసన్నం అయ్యిందని చెప్పొచ్చు.

దాదాపు ఈ చిత్రం ఈ వారంలోనే వచ్చేసే అవకాశం ఉంది. ఈ జూన్ 11 లేదా 12న ప్రైమ్ వీడియోలో ఈ సినిమా సందడి చేసే అవకాశం ఉంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఒక్కటి రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతం అందించగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు