ఈ ఓటిటి యాప్ లో శివ కార్తికేయన్ “డాన్” రిలీజ్ కి డేట్ ఫిక్స్..!

Published on May 28, 2022 7:52 pm IST


తమిళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “డాన్”. మంచి అంచనాలు నడుమ తెలుగు మరియు తమిళ్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తమిళ నాట భారీ హిట్ కాగా మన తెలుగులో కూడా సైలెంట్ హిట్ అయ్యిందని కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ సినిమా థియేటర్స్ లో ప్రస్తుతానికి మంచి రన్ ని కొనసాగిస్తూ 100 కోట్ల గ్రాస్ ని అందుకొని డాక్టర్ తర్వాత శివ కార్తికేయన్ కెరీర్ సివరుస 100 కోట్ల సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ జూన్ 10 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో కార్తికేయన్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రాన్ని సిబి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :