ఓటిటి రివ్యూ : “పేపర్” – హిందీ వెబ్ సిరీస్ ఉళ్లు లో ప్రసారం

తారాగణం : పరాగ్ త్యాగి, మనోజ్ వర్మ, అనంగ్ దేశాయ్, కేట్ శర్మ, ప్రీతి సోని మరియు గణేష్ యాదవ్

దర్శకుడు : దీపక్ పాండే

నిర్మాణం : ఉల్లు

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న వెబ్ సిరీస్ “పేపర్”.స్ట్రీమింగ్ యాప్ “ఉళ్లు”లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

అబ్దుల్(రోనిత్ రాయ్) అనే ఓ చిన్నపాటి కొబ్బరికాయల అమ్మకదారుడు జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉంటాడు. అలాగే ఆ క్రమంలో చిన్న చిన్న క్రైమ్స్ చెయ్యడం కూడా స్టార్ట్ చేస్తాడు. కానీ ఓరోజు ఇవేవి కాదు తక్కువ టైం లో ధనవంతుడు అయ్యిపోవాలి అంటే ఫేక్ స్టాంప్ పేపర్స్ చెయ్యాలనే వ్యాపారం కోసం తెలుసుకుంటాడు. అలా స్టార్ట్ చేసి దెబ్బకు తక్కువ కాలంలోనే పెద్ద ధనవంతుడు అయ్యిపోతాడు. కానీ అతను చేసిన వెర్రి పని కాస్తా పోలీసులకు హింటిచ్చినట్టు అవుతుంది. ఇక అక్కడ నుంచి అబ్దుల్ లైఫ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నదే అసలు కథ.

 

ఏమి బాగుంది?

 

ఈ సిరీస్ లో మొట్ట మొదటిగా చెప్పుకోవాలంటే మెయిన్ లీడ్ రోనిత్ రాయ్ కోసం చెప్పుకోవాలి తన పెర్ఫామెన్స్ ఈ సిరీస్ వీక్షకులను ఇతడు ఖచ్చితంగా ఆకట్టుకుంటాడు. ఒక పక్కా మాస్ హీరోకు కావాల్సిన లక్షణాలు అన్ని పుష్కలంగా ఇతడిలో ఈ సిరీస్ ద్వారా కనిపిస్తాయి.

అలాగే కొన్ని పోలీస్ వర్క్ ఎపిసోడ్స్ కానీ వారికి వారి వ్యతిరేఖ విలన్స్ నడుమ ఉండే ఎపిసోడ్స్ కానీ మంచి ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే ఈ సిరీస్ లోని నిర్మాణ విలువలు కూడా బాగా అనిపిస్తాయి. అలాగే కొన్ని స్కాం ఎపిసోడ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఇంకా మరో కీ రోల్ లో కనిపించిన కేట్ శర్మ కూడా మంచి నటనను కనబరిచింది.

 

ఏమి బాగాలేదు?

 

ఇక ఈ సిరీస్ లో అతి పెద్ద ఫ్లా ఏదన్నా ఉంది అంటే అది కథనంలో అని చెప్పాలి. డైరెక్టర్ రాసుకున్న దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చెయ్యలేకవడం మైనస్ అని చెప్పొచ్చు. అది చూసే వారికి కూడా అర్ధం అయ్యిపోయింది. ఫేక్ స్టాంప్ పేపర్ బిజినెస్ అనే పాయింట్ చాలా బలమైంది దానిని తెరకెక్కించిన విధానం ఇంకా స్ట్రాంగ్ గా చూపాల్సింది.

ఇంకా అలాగే క్లైమాక్స్ కూడా కాస్త వీక్ గానే అనిపిస్తుంది. అలాగే హీరో రోల్ మినహాయిస్తే ఇతర క్యాస్టింగ్ కానీ కొన్ని ఎమోషన్స్ పెద్దగా మెప్పించవు. అలాగే కథనం ఒక స్థాయికి చేరుకొనే సరికి అంతా ముందే ఊహించేయగలిగేలా ఉంటుంది ఇదో మైనస్. అలాగే ట్విస్టులు కూడా పెద్ద ఇంప్రెసివ్ గా అనిపించవు. అంతే కాకుండా నిర్మాణ విలువలు కూడా యావరేజ్ గానే అనిపిస్తాయి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకుంటే క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ క్రైమ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో కనిపించిన అనిత్ రాయ్ అలాగే ఎంచుకున్న ప్లాట్ లైన్ లు ఇంప్రెసివ్ గా ఉన్నా అంతగా ఆకట్టుకోని కథనం, అలాగే నిర్మాణ విలువలు, ఇతర క్యాస్టింగ్ వంటివి ఈ సిరీస్ ను చూసే వారికి బోర్ కొట్టిస్తాయి. సో ఈ సిరీస్ ను ఒకసారి చూసే కన్నా కాస్త దూరం పెట్టడమే మంచిది.

Rating: 2.25/5

సంబంధిత సమాచారం :

More