ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘అనగనగా ఒక రాజు’.. ఎప్పుడు, ఎందులో అంటే?

Anaganaga Oka Raju

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju)చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రూరల్ పొలిటికల్ కామెడీ డ్రామా, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 11, 2026 నుండి ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ‘కమింగ్ సూన్’ సెక్షన్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

​డైరెక్టర్ మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనను రాబట్టినప్పటికీ, నవీన్ పొలిశెట్టి మార్కు కామెడీకి మంచి మార్కులే పడ్డాయి. ఇందులో రావు రమేష్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, గోపరాజు రమణ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు స్వరాలను సమకూర్చారు.
​గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో సాగే వ్యంగ్యాస్త్రాలు, వినోదభరితమైన సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు ఫిబ్రవరి 11 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఎంజాయ్ చేయవచ్చు.

Exit mobile version