వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “గాలి సంపత్”

Published on Aug 26, 2021 4:39 pm IST

అన్నిష్ కృష్ణ దర్శకత్వం లో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్ లీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గాలి సంపత్. ఈ చిత్రం లో శ్రీకాంత్ అయ్యంగార్, కరాటే కళ్యాణి, తనికెళ్ళ భరణి, సత్య, రజిత, రఘుబాబు లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సైతం పని చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకులకు అలరించడానికి సిద్దం అవుతుంది. ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్టార్ మా లో గాలి సంపత్ ప్రసారం కానుంది.

ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్ షైన్ స్క్రీన్స్ పతాకం పై ఎస్.కృష్ణ, హరీశ్ పెద్ది, సాహు గారపాటి సినిమా ను నిర్మించడం జరిగింది. ఎస్. కృష్ణ ఈ చిత్రానికి కథ అందించగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :