ఎన్టీఆర్ చరణ్ తో మ్యాజిక్ చేసాడు !

Published on Aug 23, 2021 7:30 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ తో సెన్సేషన్ నమోదు చేశాడు. ఈ సారి “ఎవరు మీలో కోటీశ్వరులు”తో మరోసారి మ్యాజిక్ చేసాడు. మొదటి ఎపిసోడ్ తో ఈ షోకి మంచి హైప్ సంతరించుకుంది. గెస్ట్ గా రామ్ చరణ్ రావడం, హోస్ట్ గా ఎన్టీఆర్ ఆటను ఆడించిన విధానం మొత్తానికి ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మొదటి ఎపిసోడ్ లో హైలైట్స్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్, చరణ్ ను అడిగిన ప్రశ్నలు. అలాగే వీరిద్దరి మధ్య సాగిన సంభాషణలు. మరి, రామ్ చరణ్‌ ను ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలు ఏమిటో చూద్దాం.

మొదటి ప్రశ్న ; వీటిలో ‘గురువు’ అనే అర్థం కలిగిన పదం ఏది?
ఎ) ఆరోగ్య
బి) ఆచార్య
సి) ఐశ్వర్య
డి) ఆశ్చర్య

రెండో ప్రశ్న : హిందూ పురాణాలలో వీటిలో ఏది తాగటం వలన అమరత్వం వస్తుంది?
ఎ) కాలకూటం
బి) హలాహలం
సి) అమృతం
డి) నాలికము

మూడో ప్రశ్న : వీటిలో ఎస్‌ఎల్‌ఆర్‌, డీఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్‌స్టెంట్‌ అనేవి దేనిలో రకాలు?
ఎ) కెమెరాలు
బి) పుస్తకాలు
సి) విమానాల
డి) వజ్రాలు

నాలుగో ప్రశ్న : ఈ ఆడియో క్లిప్‌లోని గాయకుడు ఎవరు? (నువ్వు సారా తాగుట మానురన్నో లేకుంటే సచ్చి ఊర్కుంటావురన్న)
ఎ) రమణ గోగుల
బి) పవన్‌ కల్యాణ్‌
సి) దేవిశ్రీ ప్రసాద్‌
డి) మణిశర్మ

ఐదవ ప్రశ్న : వీటిలో క్రికెట్‌ ఫీల్డింగ్‌ పొజిషన్‌ కానిది ఏది?
ఎ) కవర్‌ పాయింట్‌
బి) స్లిప్‌
సి) గల్లీ
డి) వింగ్‌బ్యాక్‌

ఆరో ప్రశ్న : ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం ఏ నగరంలో ఉంది?
ఎ) న్యూయార్క్‌
బి) సిడ్నీ
సి) ఆమ్‌స్టర్‌డ్యాం
డి) లండన్‌

ఏడోవ ప్రశ్న : పెటా సంస్ధ వీటిలో దేనికి సంబంధించినది?
ఎ) మహిళల భద్రత
బి) మానవ హక్కులు
సీ) జంతువుల హక్కులు
డి) శరణార్థుల హక్కులు

ఎనిమిదో ప్రశ్న : జూన్‌ 2021 నాటికి వీరిలో ఎవరి పేరుతో తెలంగాణలో ఒక జిల్లాకు పేరు పెట్టారు?
ఎ) ఏపీజే అబ్దుల్‌ కలాం
బి) ఎస్‌.రాధాకృష్ణన్‌
సి) పీవీ నరసింహారావు
డి) కుమురం భీం

అయితే పై ప్రశ్నలు అన్నిటికీ చరణ్ చాలా సులభంగా సమాధానాలు చెప్పాడు.

సంబంధిత సమాచారం :