డిజిటల్ ప్రీమియర్ కి సిద్దమవుతున్న “తిమ్మరుసు”

Published on Aug 22, 2021 8:02 pm IST

సత్యదేవ్ న్యాయవాది గా నటించిన తిమ్మరుసు చిత్రం గత నెల 30 వ తేదీన థియేటర్ల లో విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్దం గా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ నెల 28 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్దం గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం లో సత్యదేవ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించగా, ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :