తన ప్రేమ ఎలాంటిదో చెప్పిన గుత్తా జ్వాల !

Published on Apr 10, 2020 8:04 pm IST

బ్యాడ్మింటన్‌ స్టార్‌ గా గుత్తా జ్వాలకి సోషల్ మీడియాలో పాపులారిటీతో పాటు ఫుల్ క్రేజ్ కూడా ఉంది. తన కామెంట్లతో తన బిహేవియర్ తో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇక తమిళ యాక్టర్ విష్ణు విశాల్‌ తో కొన్నాళ్లుగా గుత్తా జ్వాల డేటింగ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ జంట డేటింగ్ కే పరిమితం అవుతారా.. లేక పెళ్లి చేసుకుని ఓ ఇంటివారవుతారా అని కొంతమంది జ్వాల సన్నిహితులు జ్వాలానే అడుగుతున్నారట. విష్ణు విశాల్‌తో తన సంబంధాన్ని ఇప్పటికే ధృవీకరించిన జ్వాల.. వివాహం మాత్రం ఇప్పట్లో చేసుకునే ఆలోచన లేదని.. అయితే ప్రేమ విషయంలో మాత్రం మేము చాల క్లారిటీగా ఉన్నామని, మాది గౌరవంతో కూడుకున్న ప్రేమ అని చెబుతుందట.

కాగా జ్వాల గతంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం కొద్దికాలానికి పరిమితం అయింది. ఇటు హీరో విష్ణు విశాల్‌ కు కూడా రజనీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. కానీ వీళ్లు కూడా విడిపోయారట. మొత్తానికి ఇద్ద‌రూ త‌మ భాగ‌స్వామ్యుల‌ను వ‌దిలి.. ఒక్క‌ట‌య్యారు. మరి గుత్తా జ్వాల, విష్ణు విశాల్‌ వివాహం ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :