‘విశ్వంభర’ కోసం బయట నుంచి మెరుగులు?

‘విశ్వంభర’ కోసం బయట నుంచి మెరుగులు?

Published on Jun 23, 2026 2:00 AM IST

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి నటించిన లాంగ్ అవైటెడ్ సినిమానే “విశ్వంభర”. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ గ్రాండ్ ఫాంటసీ డ్రామా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఇప్పుడు ఓ క్లారిటీ అయితే ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలో సినిమా పనులకు సంబంధించి మాత్రం ఒకో వెర్షన్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య సంగీతం విషయంలో ఆల్రెడీ ఆస్కర్ విజేత ఎం ఎం కీరవాణి ఉంటే హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి నేపథ్య సంగీతం కోసం ట్రాక్ లోకి వచ్చాడని వినిపించింది.

ఇక తాజాగా వి ఎఫ్ ఎక్స్ కోసం యువ దర్శకుడు నాగ్ అశ్విన్ సూపర్వైజ్ చేస్తున్నారు అంటూ కొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇదెంత వరకు నిజమో కానీ దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో త్రిష, ఆశిక రంగనాథ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు