‘ది ప్యారడైజ్’ టీమ్‌కు అతిపెద్ద పరీక్ష.. సమయానికి ఇవ్వగలరా..?

‘ది ప్యారడైజ్’ చిత్రం ఓవర్సీస్ ప్రీమియర్ షోల కోసం ఫైనల్ కంటెంట్‌ను సిద్ధం చేసే పనిలో చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తోంది. టెక్నికల్ పనులు ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉండటంతో, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మూవీ టీమ్ రాత్రింబవళ్లు కష్టపడుతోంది. సాధారణంగా ఓవర్సీస్ ప్రీమియం ప్రదర్శనలకు కనీసం మూడు రోజుల ముందే ఫైనల్ కంటెంట్ అక్కడి నెట్‌వర్క్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

కేడీఎం జనరేషన్, సర్వర్ లోడింగ్ వంటి కీలక ప్రక్రియలను పూర్తి చేయడానికి ఈ సమయం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత షెడ్యూల్ ఎంతో కీలకంగా మారింది. డిసిపి లేదా హార్డ్ డిస్క్ చేరడంలో ఆలస్యమైతే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫిక్స్ చేసిన టైమింగ్స్ ప్రకారం ప్రీమియర్ షోలు సజావుగా సాగాలంటే ఫైనల్ కంటెంట్ అనుకున్న సమయానికి అందడం అత్యవసరం.

విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ఎక్కడా ఆలస్యం కాకుండా పెండింగ్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. మరి అనుకున్న సమయానికల్లా మూవీ టీమ్ కంటెంట్ డెలివరీ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version