గల్ఫ్ నేపథ్యంలో రియలిస్టిక్ సినిమా!

galf
‘గంగ పుత్రులు’, ‘సొంత ఊరు’ వంటి చిత్రాల ద్వారా విమర్శకుల ప్రశంసలనూ, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’ వంటి చిత్రాల ద్వారా బాక్సాఫీస్ విజయాలనూ సొంతం చేసుకున్న దర్శకుడు పీ. సునీల్ కుమార్ రెడ్డి. తాజాగా ఆయన ‘గల్ఫ్’ పేరుతో మరో సామాజిక సమస్య నేపథ్యంలో నడిచే కథను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గల్ఫ్ ప్రాంతాలకు వలస వెళ్ళి ఇబ్బందులకు గురయ్యే జీవితాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

గల్ఫ్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్‌ను ఈ ఉదయం విడుదల చేశారు. శ్రావ్య ఫిల్మ్స్ పతాకంపై యక్కలి రవీంద్రబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రమోషనల్ సాంగ్ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా గురించి పలు విశేషాలను తెలియజేసింది. గల్ఫ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నిజ జీవిత సమస్యలను దగ్గరగా చూసి తెరకెక్కించాలన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నారట.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం gulfthemovie@gmail.com అనే మెయిల్ ఐడీని ఏర్పాటు చేశారు. గల్ఫ్‌ అనుభవాల గురించి ఈ ఐడీకి వచ్చే సమాచారం ద్వారా పకడ్బందీగా, చిన్న చిన్న డీటైల్‌ను కూడా మిస్ చేయకుండా స్క్రిప్ట్‌ను రూపొందించనున్నారట. ఈ ఐడీకి ఎవ్వరైనా తమ గల్ఫ్‌ అనుభవాల గురించి చెబుతూ మెయిల్ చేయవచ్చని సినిమా యూనిట్ తెలిపింది. స్క్రిప్ట్ పనులు పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ప్రవీణ్ ఇమ్మడి ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Exit mobile version