సెప్టెంబర్ 3 న అమెజాన్ ప్రైమ్ లో “పాగల్”

Published on Sep 1, 2021 1:50 pm IST


విశ్వక్ సేన్ హీరోగా, నివేథా పేతురాజ్, సిమ్రాన్ చౌదరీ లు హీరోయిన్ లుగా నటించిన చిత్రం పాగల్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా వచ్చేందుకు సిద్దంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ మూడవ తేదీ నుండి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

నరేష్ కుప్పిలి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ మరియు లక్కీ మీడియా ల పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం రదన్ అందించారు.

సంబంధిత సమాచారం :