ఓటిటిలోకి వ‌చ్చేసిన ‘పారిజాత ప‌ర్వం’

ఓటిటిలోకి వ‌చ్చేసిన ‘పారిజాత ప‌ర్వం’

Published on Jun 12, 2024 11:25 AM IST

టాలీవుడ్ లో ఇటీవ‌ల రిలీజ్ అయిన సినిమాలు వ‌రుస‌గా ఓటిటిలోకి వస్తూ సంద‌డి చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన కిడ్నాప్ కామెడీ మూవీ ‘పారిజాత ప‌ర్వం’ బాక్సాఫీస్ వ‌ద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కు వ‌చ్చేసింది.

చైత‌న్య రావు, సునీల్, శ్ర‌ద్ధా దాస్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాను కంభంపాటి సంతోష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించే కంటెంట్ ఈ సినిమాలో ఉండ‌టంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ఆడియెన్స్ ఆస‌క్తిని చూపుతున్నారు.

మ‌రి ఈ సినిమాకు ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ ద‌క్కుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో వైవా హ‌ర్ష‌, మాళ‌విక స‌తీశ‌న్, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. వ‌నమాలి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను మ‌హిధ‌ర్ రెడ్డి, దేవేశ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు