ఆడియో సమీక్ష : పాఠశాల – ఫ్రెష్ ట్యూన్స్ విత్ సూపర్బ్ లిరిక్స్.!

ఆడియో సమీక్ష : పాఠశాల – ఫ్రెష్ ట్యూన్స్ విత్ సూపర్బ్ లిరిక్స్.!

Published on Sep 2, 2014 6:16 PM IST

pathasala-imge
‘వినాయకుడు’ ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న మహి దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘పాఠశాల’. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నందు, అను ప్రియ, శిరీష, సాయి కిరణ్, శివ, శశాంక్ నటించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. రాహుల్ రాజ్ అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొత్తం 5 పాటలున్న ఈ ఆల్బమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

1. పాట : ఫ్రెండ్ షిప్ యాంతం Paathshala (5)

సాహిత్యం : శ్రీ మణి

కాలేజ్ దేశ లో స్టూడెంట్ లైఫ్ కి బాధాకరమైన రోజంటే అది ఫేర్ వెల్ డే.. ఈ ఫేర్ వెల్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటూ జోష్ ఫుల్ గా సాగేలా ఈ పాట సినిమాలో ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్షిప్ గురించి మరియు కాలేజ్ ముగింపు అనేది ఫ్రెండ్షిప్ కి ఎండ్ కాదని విషయాన్ని దర్శకుడు ఈ పాట ద్వారా తెలియజేయాలకున్నాడు. దానికి శ్రీమణి సాహిత్యం కూడా బాగా కుదిరింది. ఇప్పటి యువతని ఆకట్టుకునేలా రాహుల్ రాజ్ హై రేంజ్ గిటార్ సౌండ్స్ కి డ్రమ్ బీట్స్ ని జత చేసి ఈ పాటని కంపోజ్ చేసాడు. ఈ పాట వినగా వినగా యువతని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

2. పాట : మెరిసే మెరిసే

సాహిత్యం : శ్రీ మణి

Paathshala (7)‘మెరిసే మెరిసే’ సాంగ్ ఈ పాటలో వచ్చే మొదటి మెలోడీ సాంగ్.. ‘పాఠశాల’ సినిమా ఐదుగురు ఫ్రెండ్స్ తో సాగే రోడ్ జర్నీ.. ఈ పాటలోని సాహిత్యం వింటుంటే ఫ్రెండ్స్ అంతా కలిసి ఫ్రీగా లైఫ్ లోని చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేసే టైంలో ఈ పాట వచ్చేలా అనిపిస్తోంది. శ్రీ మణి తన సాహిత్యంలో పల్లెటూరిలో ఆస్వాదించే పలు సరదాల గురించి ఎంతో చక్కగా వివరించారు. రాహుల్ రాజ్ వెస్ట్రన్ స్టైల్ లో కంపోజ్ చేసిన మ్యూజిక్ పాట కి బాగా సెట్ అవ్వడమే కాకుండా, పాట ఫీల్ తో పాటు మనల్ని ట్రావెల్ చేసేలా ఉంది. ఈ మెలోడీ వినగానే నచ్చేలా ఉంది.

3. పాట : సూర్యోదయం

సాహిత్యం : శ్రీ మణిPaathshala (1)
చాలా స్లో గిటార్ మరియు ఫ్లూట్ సౌండ్ తో మొదలయ్యే ‘సూర్యోదయం’ సాంగ్ ఈ ఆల్బంలోని మరో సోలో మెలోడీ సాంగ్. సూర్యోదయం అనేది కొత్త ఆలోచనలని నాంది అనే థీమ్ తో సాగే ఈ పాటలో శ్రీమణి సాహిత్యం బాగుంది. ఆ సాహిత్యానికి తగ్గట్టు రాహుల్ రాజ్ మ్యూజిక్ ఉంది.

4. పాట : ఫ్రీడమ్

సాహిత్యం : శ్రీ మణి

Paathshala (3)ఫాస్ట్ బీట్స్ తో యువతని ఉరకలెత్తించేలా సాగే ఫ్రీడం పాట వినగానే నచ్చేలా ఉంది. ఈ రోడ్ జర్నీ సినిమాలో జర్నీలో వచ్చే పాట ఇదని చెప్పుకోవచ్చు. ఒక ఐదుగురు ఫ్రెండ్స్ కి కి ఫ్రీడం దొరికితే ఎలా ఉంటుంది అనే భావాలను శ్రీ మణి తన సాహిత్యంలో బాగా చెప్పాడు. ఈ పాటకి సాహిత్యం కంటే రాహుల్ రాజ్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. పెర్క్యూషణ్ వాయిద్యాలను, ఎలక్ట్రిక్ గిటార్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించడం వలన వింటున్న వాళ్ళలో ఊపు వస్తుంది. అలాగే పాట మధ్యలో వచ్చే కోరస్ పాటకి బాగా హెల్ప్ అయ్యింది. ఈ ఆల్బంలో ది బెస్ట్ సాంగ్ ఇదే..

5. పాట : శూన్యమయి

సాహిత్యం : శ్రీ మణిPaathshala (6)

చాలా స్లోగా సాగే ఈ మెలోడీ పాట కూడా సోలో నెంబర్. జీవితం గురించి పూర్తిగా అర్థం చేసుకున్న ఓ యువకుడు తన అనుభవాన్ని రంగరించి పాడే పాటలా ఉన్న ఈ పాటకి మంచి విజువల్స్ తోడైతే ఇంకా బాగుంటుంది. జీవితంలో ఆనందం ఎక్కడ ఉంది.? రేపటి గురించి కాకుండా ఈ క్షణాన్ని ఎలా గడపాలనే? విషయాన్ని శ్రీ మణి తన సాహిత్యంలో చాలా బాగా చెప్పాడు. రాహుల్ రాజ్ కూడా విన సొంపైన గిటార్, వయొలిన్ సౌండ్స్ కి అక్కడక్కడా బీట్స్ ని మిక్స్ చేసి పాటలని ఫీం ఏ మాత్రం చెడిపోకుండా సంగీతం అందించాడు.

తీర్పు :

‘పాఠశాల’ అనే క్లాస్ సినిమాకి తగ్గట్టుగానే రాహుల్ రాజ్ రెగ్యులర్ మ్యూజిక్ కి దూరంగా కాస్త డిఫరెంట్ గా కాస్త క్లాస్ గా ఉండేలా ఈ ఆల్బంని అందించాడు. మొత్తం ఐదు పాటలున్న ఈ ఆల్బంలో 2 ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఉంటే మిగతా అన్నీ మెలోడీ సాంగ్స్ ఏ కావడం విశేషం. అన్ని పాటలకు శ్రీ మని చాలా చాలా అర్థవంతమైన సాహిత్యాన్ని అందించాడు. పాటలు వినగా వినగా బాగుంటాయి, సినిమాలో సందర్భానుసారంగా వచ్చేలా డైరెక్టర్ మహి తీసుకున్న పాటలు సినిమా రిలీజ్ అయ్యాక ఇంకాస్త ఫేమస్ అయ్యే అవకాశం ఉంది. నా వరకూ ‘ఫ్రీడం’, ‘మెరిసే మెరిసే’, ‘శూన్యమయి’ బెస్ట్ సాంగ్స్ గా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ‘పాఠశాల’ మ్యూజిక్ ఆల్బం కూడా సినిమాలనే కమర్షియల్ ఫార్మాట్ కి డిఫరెంట్ గా ఉంది.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు