ఐదుగురు స్నేహితులు తమ ప్రయాణంలో ఎటువంటి పాఠాలు నేర్చుకున్నారు..? ఆ ప్రయాణం వారికి ఏం నేర్పింది అనే కధాంశంతో తెరకెక్కిన చిత్రం ‘పాఠశాల’. ఈ సినిమా ద్వారా మహి వి.రాఘవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందు, సాయి రోనాక్, హమ్ ద్, అనుప్రియ, శిరీష, శశాంక్ కీలక పాత్రలలో నటించారు. ఎ మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై రాకేష్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. రాహుల్ రాజ్ సంగీతం అందించారు. నిర్మాణంతర కార్యక్రమాలతో పాటు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత రాకేష్ మహంకాళి, దర్శకుడు మహి వి.రాఘవ్ పాల్గొన్నారు.
రాకేష్ మహంకాళి మాట్లాడుతూ.. ఐదుగురు స్నేహితులు కాలేజీ పూర్తయిన తర్వాత ఎటు వెళ్ళాలో..? ఏం చేయాలో..? అని ఆలోచిస్తున్న సమయంలో ఒక స్నేహితుడి ఇంటికి పయనమవుతారు. ఆ ప్రయాణం వాళ్ళను ఎలా మార్చింది అనేది సినిమా కథ. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ వచ్చింది. అక్టోబర్ 10న విడుదల చేస్తున్నాం. అని అన్నారు.
దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ.. ‘పాఠశాల’ ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ చూస్తే ఎ తరహా చిత్రమో మీకు తెలుస్తుంది. అవుట్ పుట్ బాగా వచ్చింది. సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. ‘మై లైఫ్ మై పాఠశాల’ పేరుతో ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించాం. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అని అన్నారు.


