‘పడి పడి లేచె మనసు’ బాగా స్లోగా నడుస్తోంది !
Published on Jun 13, 2018 10:24 pm IST


హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఫిబ్రవరి 5న మొదలు పెట్టిన ఈ చిత్రం నాలుగు నెలలు దాటిపోతున్నా వర్క మాత్రం ఆశించినంత స్థాయిలో జరగకపోగా బాగా స్లోగా జరుగుతుందట. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ అప్పటిలోపు పూర్తి కాకపోవచ్చని సమాచారం. ఇంకా షూట్ చేయాల్సిన పార్ట్ చాలా ఉందని తెలుస్తోంది. పైగా లొకేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. డార్జిలింగ్, కలకత్తా ఇలా అన్ని ఒకదానికి ఒకటి సంబంధం లేని లొకేషన్లేనట. దర్శకుడు హను రాఘవపూడి షాట్ బై షాట్ చెక్కుతున్నాడని అనుకుంటుంది చిత్రబృందం.

నిర్మాతలు కొత్తవారు కావటంతో వారు వర్క్ విషయంలో దర్శకుడి మీద ఒత్తిడి చేయలేకపోతున్నారు. దాంతో ‘పడి పడి లేచె మనసు’ చిత్ర షూటింగ్ బాగా స్లోగా నడుస్తోంది. అయితే ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్ర కథకు, ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్ర కథకు పోలికలు కలుస్తాయని తెలుస్తోంది. ప్రియసి గతం మరిచిపోతే లాంటి కథాంశంతో ఈ రెండు చిత్రాలు తెరకెక్కాయి అని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook