సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిన్న సాయంత్రం నుంచి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమా స్టార్ నుంచి రాజకీయ వేత్తగా కూడా మారిన పవన్ కళ్యాణ్ కి ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ ఇచ్చి సత్కరించనున్నారని సమాచారం. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. బిజెపి లీడర్ మరియు ప్రధాని అయిన నరేంద్ర మోడీ తో పవన్ కళ్యాణ్ కి సన్నిహిత సంబందాలు ఉండడం వలన ఈ విషయానికి మరింత బలం చేకూరుతోంది.
అభిమానుల్లో దేవుడు అని పిలుచుకునే పవన్ గత ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని కూడా పెట్టారు. ఆయన పోటీ చెయ్యకుండా బిజెపి, టిడిపి పార్టీలకు పూర్తిగా సపోర్ట్ చేసి కాంపైన్ కూడా చేసాడు. కావున పవన్ కళ్యాణ్ కి పద్మ అవార్డు రావడంలో మూడీ సాయం చేసే అవకాసహం ఉందని అంటున్నారు. ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమా సక్సెఫుల్ గా రన్ అవుతోంది.


