ఆసక్తికరంగా పహిల్వాన్ ట్రైలర్…!

Published on Aug 22, 2019 4:14 pm IST

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన చిత్రం పహిల్వాన్ . బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ , తెలుగు, కన్నడ,తమిళ, మలయాళ భాషలలో భారీగా విడుదల కానుంది.సుదీప్ ఈ మూవీ కొరకు దేశములోని అన్ని ప్రధాన పరిశ్రమల ప్రముఖులను కలిసి చిత్రానికి మంచి ప్రచారం కల్పించే పనిలో పడ్డాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి మంచి స్పందన వచ్చింది.

కాగా పహిల్వాన్ మూవీ ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. కుస్తీ వీరుడు బాక్సింగ్ రింగ్ లో దిగితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూడొచ్చనిపిస్తుంది. తన కలల సాకారం కోసం ఓ వ్యక్తి చేసిన మానసిక, శారీరక పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతుంది. సీనియర్ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సుదీప్ గురువుగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్. కృష్ణ నిర్మిచడంతో పాటు దర్శకత్వం వహించారు. తెలుగులో వారాహి చలన చిత్ర సమర్పిస్తుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :