“పక్కా కమర్షియల్” నుంచి మంచి క్యాచీ గా లేటెస్ట్ సాంగ్ ప్రోమో.!

Published on May 28, 2022 12:00 pm IST

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లాస్ట్ సినిమా “సీటీమార్” తో మంచి హిట్ ని అందుకున్నాక దర్శకుడు మారుతీ తో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే “పక్కా కమర్షియల్”. బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా నటించింది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు ఎప్పటికపుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఇస్తూ వస్తుండగా లేటెస్ట్ గా సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో ని లాంచ్ చేశారు.

అయితే ఇది మాత్రం మంచి క్యాచీగా ఉందని చెప్పాలి. జెక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ ఫస్ట్ టైం వినడంలోనే మ్యూజిక్ లవర్స్ కి నచ్చేలా ఉంది. అలాగే హీరోయిన్ రాశీ ఖన్నాని దర్శకుడు ఈ సాంగ్ లో చాలా అందంగా గ్లామరస్ గా చూపించారు. ఇంకా గోపీచంద్ కూడా మంచి హ్యాండ్సమ్ గా కనిపించడమే కాకుండా ఇద్దరి కాస్ట్యూమ్స్ లో ఈ సాంగ్ లో ఆకర్షణీయంగా ఉన్నాయి. మొత్తానికి అయితే ఈ ప్రోమో మంచి ప్రామిసింగ్ గా ఉంది. ఇక ఫుల్ సాంగ్ ఈ జూన్ 1న రిలీజ్ కానుండగా అదెలా ఉంటుందో చూడాలి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :