ఇంటర్వ్యూ : “పలాస 1978” దర్శకుడు కరుణ కుమార్ – నిజాయితీగా చెప్పిన కథ ఇది

ఇంటర్వ్యూ : “పలాస 1978” దర్శకుడు కరుణ కుమార్ – నిజాయితీగా చెప్పిన కథ ఇది

Published on Mar 1, 2020 6:11 PM IST

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978′. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కరుణ కుమార్ తో ఇంటర్వ్యూ…

 

ఆ అవార్డ్ నాలో నమ్మకం పెంచింది

కథలు రాయడం అలవాటు అయ్యాక…స్వచ్ఛ భారత్ కి నేను చేసిన ‘చెంబుకు మూడింది’ లఘు చిత్రం జాతీయ స్థాయిలో రెండో బహుమతి తెచ్చుకోవడం నా జీవితంలో కీలక మలుపు గా మారింది. ఆ సందర్భంగా కేటీఆర్ గారు, వెంకయ్యనాయుడు గారు సన్మానించారు.. అప్పుడు కేటీఆర్ గారి ప్రోత్సహంతో చాలా గవర్నమెంట్ యాడ్స్ చేసాను. తర్వాత కొన్ని కథలు రాసుకున్నాను. కానీ ‘పలాస ‘ మొదటి సినిమా అవుతుంది అనుకోలేదు.

 

వాస్తవ సంఘటనల నేపథ్యంలో..

1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా “పలాస 1978”. తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో ఉన్న అనుబంధంతో మొదట ఈ కథను ఆయనకు క్లుప్తంగా వివరించాను. కథ నచ్చి వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. ఆయనే ప్రొడ్యూసర్ ప్రసాద్ గారిని పరిచయం చేసారు. ఆయనకు కథ నచ్చడంతో వర్క్ షాప్ లు నిర్వహించి, ప్రోపర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో సినిమాను ప్రారంభించాము.

 

పాత్రలు ప్రత్యేక ముద్రను వేసుకుంటాయి…

ఈ సినిమాలోని పాత్రలు మాట్లాడే మాటలు రెగ్యులర్ సినిమాలలో ఉండేలా కాకుండా కంటెంట్ బేస్డ్‌గా ఉన్నాయి. సినిమా కథ ఎంత సీరియస్‌గా సాగుతుందో ఈ మాటలలో అర్ధం అవుతుంది. సినిమా కథ లోతుగా, సీరియస్‌గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. పాత్రల పేర్లు, వేష బాషలు చాలా సహజంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో జరిగిన కథ, ఇది వరకూ ఎవరూ చెప్పని కథ అంటూ మొదలైన ఈ యానిమేటడ్ బుక్ మొదటి పేజి నుండి చివరి పేజీ వరకూ ఆసక్తిగా ఉంది. ఇందులోని పాత్రలు ప్రత్యేక ముద్రను వేసాయి. ఉత్తరాంధ్ర జానపదం నుండి తీసుకున్న పాటలకు విశేష స్పందన వస్తుంది. పలాస మూవీ లో కనిపించే విజువల్స్ ఇప్పటి వరకూ తెలుగు తెర మీద రాలేదు. ఇది ఒక వ్యక్తి కథో, కుటుంబం కథో కాదు…ఇది ఒక సమూహం కథ’.

 

*నిజాయితీగా చెప్పిన కథ ఇది…*

ఎవ్వరి మనోభావాలు దెబ్బ తినకుండా అందరిని అలరించే విధంగా పలాస కథను తెరమీద ఆవిష్కరించడం జరిగింది. ఒక నిజాయితీ ఈ కథలో కనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూసిన అందరూ బాగుందని మెచ్చుకున్నారు. సురేష్ బాబు సుకుమార్ బన్నీ వాసు, నాగ శౌర్య సినిమా చూసిన తరువాత చెప్పిన మాటలు మర్చిపోలేను. విడుదలకు ముందే సినిమా కు ఇండస్ట్రీలో మంచి స్పందన ఉంది. రక్షిత్, రఘు కుంచె , తిరువీర్, నక్షత్ర పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండి పోతాయి.

 

*పలాస కు ప్రసంశలు…*

సెన్సార్‌ బోర్డ్‌వారు ఎక్కువ కట్స్‌ సూచించడంతో రివైజ్‌ కమిటీకి వెళ్లాం. అక్కడ మా చిత్రాన్ని చూసి, ప్రశంసించారు. తెలుగు సినిమాలో ‘పలాస 1978′ చిత్రం భిన్నమైనదని చెప్పగలను. రచయితగా ఉన్న నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, మాకు అండగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజగారికి, మా సినిమాను విడుదల చేస్తున్న సురేష్‌ ప్రొడక్షన్‌ సంస్థవారికి ధన్యవాదాలు అంటూ ‘ముగించారు.

కాగా రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె, కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్ పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, నిర్మాత : ధ్యాన్ అట్లూరి. రచన- దర్శకత్వం : కరుణ కుమార్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు