నేడే ‘పండగ చేస్కో’ ఆడియో రిలీజ్!

నేడే ‘పండగ చేస్కో’ ఆడియో రిలీజ్!

Published on May 1, 2015 1:00 PM IST

Pandaga-Chesuko

రెండు వరుస అపజయాల తర్వాత ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న సంకల్పంతో ఉన్నాడు హీరో రామ్. ఈ క్రమంలోనే ‘పండగ చేస్కో’, ‘శివం’, ‘హరికథ’ లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా మారిపోయాడు. ‘బలుపు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని ‘పండగ చేస్కో’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు ఆడియో రిలీజ్ జరుపుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి.

థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘పండగ చేస్కో’ ఆడియోను ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్‌లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా సాటిలైట్ హక్కులు బంపర్ ధరకు అమ్ముడుపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక మే నెల్లోనే సినిమాను కూడా విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు