రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో ‘పండగ చేస్కో’ షూటింగ్.

రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో ‘పండగ చేస్కో’ షూటింగ్.

Published on Jul 17, 2014 11:29 AM IST

ram-pothineni
యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పండగ చేస్కో’ షూటింగ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో జరుగుతుంది. రామ్, వెన్నెల కిషోర్ లపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ ఎన్నారై యువకుడిగా నటిస్తున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటివలే సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో రాకుల్ ప్రీత్ భారి డైలాగులను చెప్పింది.

ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్ కథ అందించారు. తమన్ సంగీత దర్శకుడు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు

తాజా వార్తలు