ఎనెర్జిటిక్ హీరో రామ్ తన గత చిత్రాలు కొన్ని ఫెయిల్ అవ్వడంతో లో ప్రొఫైల్ మెయిన్టైన్ చేస్తున్నాడు. తాజా గా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని అందమైన రకుల్ ప్రీత్ సింగ్ లతో ‘పండగ చేస్కో’ సినిమా చేస్తున్నాడు. ‘పండగ చేస్కో’ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుందని ఈరోజు ట్వీట్ చేసాడు.
ఈ లవ్ మరియు కామెడీ ఎంటర్టైనర్ కి కోన వెంకట్ అనిల్ రావిపూడి డైలాగ్స్ రాస్తున్నారు. గోపీచంద్ స్క్రీన్ ప్లే దర్శకత్వం చేస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని కృష్ణ కిరీటి యునైటెడ్ మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.


