‘పండగ చేస్కో’లో తన క్యారెక్టర్ రివీల్ చేసిన సోనాల్ చౌహన్

‘పండగ చేస్కో’లో తన క్యారెక్టర్ రివీల్ చేసిన సోనాల్ చౌహన్

Published on Nov 17, 2014 9:38 PM IST

Sonal-Chauhan
‘లెజెండ్’ తర్వాత తెలుగులో సోనాల్ చౌహన్ నటిస్తున్న చిత్రం ‘పండగ చేస్కో’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ తో రొమాన్స్ చేయబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ‘పండగ చేస్కో’ చిత్రీకరణ జరుగుతుంది. రామ్ చాలా అందగాడు, ఫ్రెండ్లీ నేచర్ అంటూ హీరోపై పొగడ్తల వర్షం కురిపిస్తుంది ఈ ‘టైం బాంబ్ పిల్ల’. ఈ చిత్రంలో తన చేస్తున్న క్యారెక్టర్ ఎలా ఉంటుందో..? రివీల్ చేసింది.

‘పండగ చేస్కో’లో నేను ఎన్నారైగా కనిపిస్తాను. మనసుకి ఇష్టమైన పని చేసే యంగ్ బిజినెస్ విమెన్ గా నటిస్తున్నాను. తీవ్రమైన భావోద్వేగాలు పలికించడానికి ఆస్కారమున్న పాత్ర. ‘లాడ్ల’ చిత్రంలో శ్రీదేవి చేసిన క్యారెక్టర్ తరహాలో ఉంటుంది. చాలెంజింగ్ రోల్, కాని ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నాను. అని సోనాల్ చౌహన్ తెలిపింది.

రామ్ కూడా ఎన్నారై యువకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ మరో కధానాయిక. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు