ఇద్దరు హీరోయిన్స్ తో సందడి చేస్తున్న రామ్

ఇద్దరు హీరోయిన్స్ తో సందడి చేస్తున్న రామ్

Published on Dec 14, 2014 9:05 PM IST

Ram

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న’పండగ చేస్కో’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం రామ్ – రకుల్ ప్రీత్ సింగ్ – సోనాల్ చౌహాన్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత జరిగే ఫైనల్ షెడ్యూల్ తో ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి వెలిగొండ శ్రీనివాస్ కథని అందించారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ మాటలు రాస్తున్నారు. ఇది కాకుండా రామ్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇది వరకే తెలియజేశాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు