‘పందెంకోడి 2’ రిలీజ్ డేట్ కన్ఫార్మ్

‘పందెంకోడి 2’ రిలీజ్ డేట్ కన్ఫార్మ్

Published on Jul 9, 2018 10:24 PM IST

vishal2

హీరో విశాల్ , కీర్తి సురేష్ జంటగా లింగు సామి దర్శకత్వంలో తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘సందకోడి 2’. 2005లో విశాల్ , మీరా జాస్మిన్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం సాధించిన ‘సందకోడి’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు చిత్ర యూనిట్. అక్టోబర్18న ప్రేక్షకులముందుకు రానుంది ఈ చిత్రం. విశాల్ సొంత సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు . తెలుగులో ‘పందెంకోడి 2’ పేరుతో విడుదల కానుంది ఈ చిత్రం.

తాజా వార్తలు