‘పందెంకోడి 2’ లేటెస్ట్ అప్ డేట్స్ !

‘పందెంకోడి 2’ లేటెస్ట్ అప్ డేట్స్ !

Published on Aug 15, 2018 2:46 AM IST

విశాల్ , మీరా జాస్మిన్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం సాధించిన ‘సందకోడి’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘సందకోడి 2’. లింగు సామి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విశాల్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇక ఇటీవల ఆమె పాత్రకు సంభందించిన చిత్రీకరణను పూర్తి చేసింది. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ మదురై లో జరుగుతుంది. మరో రెండు రోజుల్లో ఈచిత్ర షూటింగ్ పూర్తి కానుంది.

రూరల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్18న తమిళ , తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విశాల్ సొంత సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈచిత్రం తెలుగులో ‘పందెంకోడి 2’ పేరుతో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు