‘పందెంకోడి 2’ టీజర్ ఆ రోజే రానుంది !
Published on Aug 23, 2018 1:37 pm IST

విశాల్, కీర్తి సురేష్ జంటగా లింగు సామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సందకోడి 2’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను విశాల్ బర్త్ డే రోజు ఆగస్టు 29న విడుదలచేయనున్నారు. ఈ చిత్రం తెలుగులో పందెం కోడి 2 పేరుతో విడుదలకానుంది.

ఈ చిత్రానికి సంభందించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు హీరో విశాల్. ఈ చిత్రం 2005లో విశాల్, మీరా జాస్మిన్ జంటగా లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం సందకోడి చిత్రానికి సీక్వెల్ గా వస్తుంది . ఇక తెలుగులో పందెం కోడి పేరుతో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. దాంతో పందెం కోడి 2చిత్ర తెలుగు హక్కులను భారీ ధరకు దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు విజయదశమి కానుకగా అక్టోబర్ 18న తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook