హీరో గోపిచంద్, మెహ్రీన్ జంటగా నూతన దర్శకుడు చక్రవర్తి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పంతం’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని జులై 5న విడుదలకు సిద్దమవుతోంది. గోపిచంద్ కి ఇది 25వ సినిమా కావడం వలన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి రెస్పాన్ ను రాబట్టుకుంది .మంచి సోషల్ కాజ్ తో గోపిచంద్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న గోపిచంద్ ని ఈ ‘పంతం’ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి. సత్యసాయి ఆర్ట్స్ పతాకంఫై కే కే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక మ్యాచో హీరో గోపిచంద్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ‘పంతం’ చిత్ర యూనిట్ మరియు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషస్ ను తెలియజేశారు .


