పంతం మొదటి రోజు కలక్షన్స్ !

Published on Jul 6, 2018 7:15 am IST

నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో గోపిచంద్ నటించిన 25 వ చిత్రం ‘పంతం’. మంచి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు మంచి కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రం రూ. 5. 2 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి రూ. 3. 22 కోట్ల షేరును రాబట్టి గోపిచంద్ కెరీర్ లోనే మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఈ వారాంతంలో మంచి వసూళ్లనే రాబట్టుకొనేలా వుంది ఈ చిత్రం . సత్యసాయి ఆర్ట్స్ పతాకంఫై కే కే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిచారు.

సంబంధిత సమాచారం :