విడుదలకు సిద్దమైన ‘పంతం’ టీజర్ !

విడుదలకు సిద్దమైన ‘పంతం’ టీజర్ !

Published on Jun 1, 2018 4:01 PM IST

ఈ మధ్య కాలంలో సరైన హిట్ అనేది ఎరుగని హీరో గోపీచంద్ చేస్తున్న కొత్త సినిమా ‘పంతం’. నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో ఈ చిత్ర్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్, స్కాట్లాండ్ దేశాల్లో జరుగుతోంది. ఈ సినిమా యొక్క టీజర్ ను జూన్ 5వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి చేస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. గోపీచంద్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాతో విజయాన్ని అందుకుని హిట్ ట్రాక్ ఎక్కాలనే ఆలోచనలో ఉన్నారు గోపీచంద్.

తాజా వార్తలు