ముందే వచ్చేస్తున్న ‘పేపర్ బాయ్’ !
Published on Aug 22, 2018 1:56 pm IST


దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కతున్న తాజా చిత్రం ‘పేపర్ బాయ్’. కాగా మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న విడుదల చేయాలనీ దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించనప్పటికీ, తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ మారిందని ఆగష్టు 31 విడుదల అవ్వబోతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

కాగా నూతన దర్శకుడు జయశంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కొత్త కథాంశంతో వస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయని, పైగా ఈ ప్రేమ కథ మొత్తం కొత్త నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి నిర్మాత బాధ్యతలే కాకుండా కథ కథనం మాటలు కూడా అందించారు. ఈ చిత్ర విజయం సంపత్ నందికి చాలా కీలకం కానుంది.

  • 5
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook