సమీక్ష : పరమపద సోపానం – రెగ్యులర్ క్రైమ్ యాక్షన్ డ్రామా!

సమీక్ష : పరమపద సోపానం – రెగ్యులర్ క్రైమ్ యాక్షన్ డ్రామా!

Published on Apr 24, 2026 5:36 PM IST

Paramapada-Sopanam

విడుదల తేదీ : ఏప్రిల్ 24, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అర్జున్ అంబటి, జెనిఫర్ ఇమ్మాన్యుయేల్, అజయ్ రత్నం, నమ్రిత మల్ల, అమిత్ తివారీ, జ్యోతి తదితరులు.
దర్శకుడు : నాగ శివ
రచయిత : నాగ శివ మరియు అర్జున్ అంబటి
సంగీతం : దేవ్ జాండ్
సినిమాటోగ్రఫీ : ఈశ్వర్ యెల్లు మహంతి
ఎడిటింగ్ : గౌతంరాజు నేరుసు
నిర్మాత : గణపర్తి నారాయణరావు

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘పరమపద సోపానం’. స్వయంభూ క్రియేషన్స్ పతాకంపై నాగ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అర్జున్ (అర్జున్ అంబటి) ఒక గేమర్. మరోవైపు సిటీలో ఓ హత్య అనుమానాస్పద పరిస్థితులలో జరుగుతుంది. పోలీసు దర్యాప్తులో ఒక అస్పష్టమైన క్లూ బయటపడుతుంది. మృతదేహం పై 30 వేలిముద్రలు కనిపిస్తాయి. ఈ కేసును విచారణ చేస్తున్న సమయంలో అర్జున్ పై పోలీసులకు అనుమానం వస్తోంది. అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోలీస్ అధికారి నేహా (జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్)తో అర్జున్ ప్రేమలో పడతాడు. తన గేమింగ్ మీటింగ్ కోసం అర్జున్, నేహా అండ్ ఆమె టీమ్ తో సహా గోవా వెళ్తారు. గోవాలో కూడా ఓ హత్య జరుగుతుంది. ఆ హత్యకి అర్జున్ కి అసలు సంబంధం ఏమిటి ?, అసలు అర్జున్ ఎవరు ?, చనిపోయిన వాళ్ళంతా పాలకడలికి సంబంధించిన వ్యక్తులు. ఇంతకీ గతంలో పాలకడలిలో ఏం జరిగింది ?, ఫైనల్ గా హత్యలు చేస్తున్న వ్యక్తులు ఎవరు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన అర్జున్ అంబటి తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ క్రైమ్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ప్రధానంగా కొన్ని కీలక సన్నివేశాల్లో తన తన పర్ఫార్మెన్స్‌తో అర్జున్ అంబటి ఆకట్టుకున్నాడు. మరో ప్రధాన పాత్రలో నటించిన అజయ్ రత్నం కూడా చాలా బాగా నటించాడు. ఆయన నటన సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ గా జెనిఫర్ ఇమ్మాన్యుయేల్ నటన పర్వాలేదు.

ఇక మెయిన్ క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్రైమ్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. అదేవిధంగా దర్శకుడు నాగ శివ హత్యల చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది. నమ్రిత మల్ల, అమిత్ తివారీ, జ్యోతి తదితరులతో పాటు ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొత్తానికి సీరియస్ క్రైమ్ సన్నివేశాల్లోని డ్రామా కొన్ని చోట్ల బాగానే సాగింది.

మైనస్ పాయింట్స్:

ఈ ‘పరమపద సోపానం’ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. చాలా చోట్ల స్క్రీన్ ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. దీనికితోడు, అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది.

అసలు సినిమా మొత్తం హత్యల చుట్టే తిరిగింది కాబట్టి, ఆ డ్రామాను ఇంకా బలంగా డిటైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేసి కన్వెన్స్ చేయాల్సింది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ ఆకట్టుకోవు. మొత్తమ్మీద ఈ ‘పరమపద సోపానం’ మూవీ మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని సీన్స్ విషయంలో బాగాలేదు. అలాగే, క్లైమాక్స్ లోని సీన్స్ కూడా ఆకట్టుకోవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు నాగ శివ మంచి క్రైమ్ థ్రిల్లర్స్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఈశ్వర్ యెల్లు సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. దేవ్ జాండ్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత గణపర్తి నారాయణరావు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

‘పరమపద సోపానం’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో కొన్ని క్రైమ్ సీన్స్ బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ క్రైమ్ డ్రామాలో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు