‘పరాశక్తి’ ఓటీటీ డీల్ పూర్తి.. శివకార్తికేయన్ కెరీర్‌లోనే బెస్ట్..!

‘పరాశక్తి’ ఓటీటీ డీల్ పూర్తి.. శివకార్తికేయన్ కెరీర్‌లోనే బెస్ట్..!

Published on Dec 16, 2025 8:10 AM IST

parasakthi
తమిళ హీరో శివకార్తికేయన్ దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది.

అయితే, ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 రూ.52 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది శివకార్తికేయన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ డిజిటల్ డీల్ అని చెప్పాలి. మొదట నెట్‌ఫ్లిక్స్ రూ.45 కోట్లు ఆఫర్ చేయగా, చివరకు జీ5 డీల్ దక్కించుకుంది.

ఇక ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ బాస్కరన్ నిర్మిస్తుండగా జయం రవి, అథర్వ మురళి, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ సంగీతం, రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బలంగా నిలవనున్నాయి. ఇక ఈ చిత్రాన్ని 2026 పొంగల్ కానుకగా విడుదల చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు