పక్కాగా ప్లాన్ చేస్తున్న “సర్కారు వారి పాట” డైరెక్టర్.?

Published on Aug 13, 2020 5:02 pm IST

బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు భారీ హిట్లతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ అదే స్వింగ్ లో మరో హ్యాట్రిక్ కు నాంధి పలికారు. అలా ఇప్పుడు లేటెస్ట్ గా మొదలు పెట్టిన చిత్రం “సర్కారు వారి పాట”. మొన్న మహేష్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ తో మరిన్ని అంచనాలు పెంచేశారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు పరశురామ్ పై మహేష్ అభిమానులు స్కై హై అంచనాలు పెట్టుకున్నారు. అయితే వారి అంచనాలకు తగ్గట్టుగా వారితో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ ను కూడా ఎక్కడా డిజప్పాయింట్ చెయ్యకుండా స్క్రిప్ట్ ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారట.

అందుకు ఈ లాక్ డౌన్ సమయాన్ని బాగా వినియోగించుకుంటున్నట్టు తెలుస్తుంది.షూటింగ్ మొదలయ్యాక ప్రతీ షెడ్యూల్ ను ఎలా చెయ్యాలో అన్నది ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే భారీ ప్లానింగ్స్ చేసిన ఈ చిత్రంతో ఎలాగైనా మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని పరశురామ్ గట్టిగా ఫిక్స్ అయ్యినట్టున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :

More