“సర్కారు వారి పాట”కు డైరెక్టర్ ప్లానింగే వేరు.!

“సర్కారు వారి పాట”కు డైరెక్టర్ ప్లానింగే వేరు.!

Published on Feb 9, 2021 11:00 AM IST

SarkaruVaariPaata

వరుసగా మూడు బడా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమాలను మొదలు పెడతారా అని అనుకున్న సమయంలో పరశురామ్ పెట్లతో “సర్కారు వారి పాట” అనే చిత్రాన్ని అనౌన్స్ చేసి మరోసారి సెన్సేషన్ ను నమోదు చేశారు. జస్ట్ అనౌన్సమెంట్ తోనే ఈ సెన్సేషనల్ కాంబో కోసం మహేష్ ఫ్యాన్స్ గట్టిగానే ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రంకు సంబంధించి దర్శకుడు పరశురామ్ పెట్ల ప్లానింగే వేరే లెవెల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దుబాయ్ షెడ్యూల్ లో హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేసిన పరశురామ్ పెట్ల మహేష్ ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా కనిపించని సీక్వెన్స్ ను డిజైన్ చేస్తున్నట్టుగా ఒక హిస్టీరియాను క్రియేట్ చేసేసారు.

అంతే కాకుండా సంగీతం పరంగా కూడా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రత్యక్ష్యంగా థమన్ సంగీతంలో ప్రమేయం ఉన్నట్టుగా థమనే తెలిపాడు. దీనిని బట్టి పరశురామ్ పెట్ల మహేష్ తనకు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను ఎంతలా జాగ్రత్తగా టేక్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. మరి ఆన్ స్క్రీన్ పై ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు