అల్లు శిరీష్ ని డైరెక్ట్ చేయనున్న పరశురాం.?

అల్లు శిరీష్ ని డైరెక్ట్ చేయనున్న పరశురాం.?

Published on Jan 6, 2015 11:49 AM IST

parusram-allu-siresh
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం యువత, సోలో, సారోచ్చారు సినిమాల దర్శకుడు తన నెక్స్ట్ సినిమా అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ తో చేయనున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. గత కొద్ది రోజులుగా పరశురాం రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ లో ‘చుట్టాలబ్బాయి’ సినిమా చేయడానికి వెయిట్ చేసాడు. కానీ అది ఆలస్యం అవుతుండడంతో అల్లు శిరీష్ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యాడు.

పరశురాం సినిమాకంటే ముందు అల్లు శిరీష్ ఓ కొత్త డైరెక్టర్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా మొదలు పెట్టి 45 రోజుల సింగల్ షెడ్యూల్లో ఫినిష్ చెయ్యాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా ఇంకా మొదలు కాలేదు. ఈ లేటెస్ట్ న్యూస్ ప్రకారం పరశురాం సినిమా ముందు సెట్స్ పైకి వెళ్తుందా లేక అల్లు శిరీష్ ముందు అనుకున్న సినిమానే సెట్స్ పైకి తీసుకెళ్తాడా అన్నది తెలియాల్సి ఉంది. అల్లు శిరీష్ చివరిగా ‘కొత్త జంట’లో కనిపించాడు.

తాజా వార్తలు