చైతు సినిమా చేశాకే.. బన్నీ సినిమా ఉంటుందట !

Published on Aug 22, 2021 11:05 pm IST

దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాని చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ కూడా పరుశురామ్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, గీతా ఆర్ట్స్ పరశురామ్ – బన్నీ సినిమాని నిర్మించబోతుంది అని గత కొన్ని రోజులుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. పైగా పరుశురామ్, బన్నీకి కథ కూడా చెప్పాడని వార్తలు వచ్చాయి.

అయితే, పరుశురామ్ తన తర్వాత సినిమాని నాగచైతన్యతో చేస్తాను అంటూ ఇప్పటికే కమిట్ అయ్యాడు. కాబట్టి చైతు సినిమా తర్వాత బన్నీతో సినిమా ఉండే అవకాశం ఉంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రస్తుతం చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన స్పెషల్‌ వీడియో కూడా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :