“కిన్నెరసాని” నుంచి ఆకట్టుకుంటునే లిరికల్ సాంగ్..!

Published on Sep 28, 2021 10:50 pm IST

మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు, యంగ్‌ హీరో క‌ల్యాణ్ దేవ్ హీరోగా, ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కిన్నెర‌సాని’. ఎస్ఆర్‌టీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై రామ్ త‌ల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుదలైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘పార్వతీపురం’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.

అయితే మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ కంపోజ్ చేసిన ఈ పాటకు కిట్టు విస్సా ప్ర‌గ‌డ లిరిక్స్ రాయగా, ఉమా నేహా, రేవంత్‌, ధ‌నుంజ‌య్ సీపానా ఆలపించారు. ఇకపోతే ఈ మూవీలో హీరోయిన్‌గా అన్ శీత‌ల్ నటిస్తుండగా, ర‌వీంద్ర విజ‌య్‌, మ‌హ‌తి బిక్షు, క‌శిష్ ఖాన్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

లిరికల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :